‘లవర్’ను దాటేసిన’ఆర్ఎక్స్ 100’ !

Published on Jul 22, 2018 10:02 am IST

విడుదలైన దగ్గర్నుండి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తూ అద్భుతమైన కలెక్షన్స్ దూసుకుపోతుంది ‘ఆర్ఎక్స్ 100’. ఇక ఈచిత్రం నిన్న ఒక్క రోజే ఇటీవల విడుదలైన ‘లవర్’ మొదటి రోజు కలెక్షన్స్ కంటే ఎక్కువ వసూళ్లను సాధించి జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది.

ఇక మొన్న విడుదలైన చిత్రాల టాక్ అంతంతమాత్రంగానే ఉండడంతో వచ్చే వారం బాక్సాఫిస్ వద్ద తన జోరును కొనసాగించనుంది ఆర్ఎక్స్100. నూతన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. కేవలం 2. 5 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మితమైన ఈచిత్రం ఇప్పటివరకు దానికి నాలుగింతల రెట్టింపు వసూళ్లను రాబట్టింది.

సంబంధిత సమాచారం :

X
More