ఆ బ్లాక్ బస్టర్ దర్శకుడి ఒక్క ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

ఆ బ్లాక్ బస్టర్ దర్శకుడి ఒక్క ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

Published on Jul 14, 2019 12:06 AM IST

హీరో కార్తికేయ,పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు అజయ్ భూపతి దర్శకతంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100మూవీ విడుదలై నిన్నటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకుంది. ప్రేమకి ఒకరు పెళ్ళికి మరొకరు ప్రేమకి అనుకొనే కన్నింగ్ లేడీ వలన జీవితం కూలిపోయిన యువకుడి కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకి,ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ ఐయ్యింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రెట్టింపుకు పైగా వసూళ్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది.

ఈమూవీ విజయంతో హీరో కార్తికేయ టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హీరోయిన్ రాజ్ పుత్ కూడా అడపాదడపా అవకాశాలు పొందుతుంది. కానీ దర్శకుడు అజయ్ భూపతికి మాత్రం అనేక అవకాశాలు వచ్చాయి. కానీ కారణాలు ఏవైనా ఇంత వరకు ఒక్క సినిమాను కూడా ఫైనలైజ్ చేయలేకపోయారు. టాలీవుడ్ లోని ఒక యంగ్ హీరోతో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అందులో ఎటువంటి నిజం లేదని స్వయంగా అజయ్ భూపతి ఖండించడం జరిగింది. చిన్న సినిమాతో అంత పెద్ద విజయాన్ని అందుకున్న ఈ యంగ్ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు