ఓటిటి లోకి వచ్చిన “సాగు”

ఓటిటి లోకి వచ్చిన “సాగు”

Published on Mar 4, 2024 1:45 PM IST


వంశీ తుమ్మల మరియు హారిక బల్లా ప్రధాన పాత్రలలో నటించిన సాగు చిత్రం ఓటిటి లోకి వచ్చేసింది. మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో డా.వినయ్ రత్నం దర్శకత్వంలో యశస్వి వంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హంగామా ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి ఈ సినిమా అందుబాటులో ఉంది. టాప్ 100 షార్ట్ ఫిల్మ్‌ల కేటగిరీలో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డును అందుకున్న సాగు త్వరలో అమేజాన్ ప్రైమ్ వీడియో, సోనీ, టాటా స్కై బింగ్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ మరియు MX Player వంటి ఇతర ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల లోకి రానుంది.

బాలాజీ, అఖిలేష్, కళ్యాణ్, రాజశేఖర్, శంకర్రావు, బాబురావు, నరసింహదాస్, స్వర్ణ, శ్రీనివాస్ మరియు ఇతర ప్రతిభావంతులైన వ్యక్తులు ఈ సినిమా లో కీలక పాత్రలు పోషించారు. సుహిత్ బంగేరా మరియు ధని కురియన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు