‘సాహో’ అబుదాబి షూటింగ్ కొత్త విశేషాలు !

‘సాహో’ అబుదాబి షూటింగ్ కొత్త విశేషాలు !

Published on May 15, 2018 8:29 AM IST


రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ దుబాయ్ లోని అబుదాబిలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. రూ. 90 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ షెడ్యూల్లో హెవీ యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో పలువురు హిందీ నటులతో పాటు పాపులర్ తమిళ నటుడు అరుణ్ విజయ్ కూడ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఆయన నిన్ననే అబుదాబి షూటింగ్లో జాయిన్ అయి కార్ ఛేజింగ్ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శంకర్, ఇహసాన్, లోయ్ లు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు.

తాజా వార్తలు