“సాహో” ఫస్ట్ సింగిల్ ను తక్కువ అంచనా వేస్తే పొరపాటే.!

“సాహో” ఫస్ట్ సింగిల్ ను తక్కువ అంచనా వేస్తే పొరపాటే.!

Published on Jul 3, 2019 10:11 PM IST

ఇప్పుడు ఇండియా వైడ్ “సాహో” ఫీవర్ పట్టుకుంది. ప్రభాస్ బాహుబలి చిత్రాన్ని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ డార్లింగ్ అభిమానులకు ఆ రెండు సినిమాలు పూర్తయ్యిపోయి “సాహో” వరకు పడిగాపులు తప్పలేదు.అయినా సరే వారిలో కసి అంతకంతకు పెరిగిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. ఇదిలా ఉండగా ఈ మధ్యనే విడుదల చేసిన “సాహో” టీజర్ అన్ని భాషల్లోనూ దుమ్ము దులపగా చిత్ర యూనిట్ వారు సాహో ఫస్ట్ సింగిల్ టీజర్ ను విడుదల చేయబోతున్నామని ప్రకటించి ప్రమోషన్స్ జోరు పెంచి అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.

ఈ ఫస్ట్ సింగిల్ కు “సైకో సయాన్” పేరు కూడా పెట్టి ఒక పోస్టర్ ద్వారా విడుదల చేసారు.ఈ పోస్టర్ ను చూస్తే ఏదో పార్టీ సాంగ్ లా ఉందని ఇట్టే అర్ధం అవుతుంది.చూడ్డానికి అంతా కొత్తగా ఉంది ఈ పాట ఎలా ఉంటుందో అని అనుకుంటే పొరపాటే అని నెటిజన్స్ అంటున్నారు. ఎందుకంటే ఈ సాంగ్ ను బాలీవుడ్ కు చెందిన ప్రముఖ కంపోజర్ “తనిష్క్ బాగ్చి” సమకూరుస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ లో ఈ సంగీత దర్శకుడి ఖాతాలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన పాటలే ఉన్నాయి.

500 మిలియన్ మార్కును అందుకున్న పాటలు కూడా ఉన్నాయి.దీన్ని బట్టి ఈ పాటపై అంచనాలు ఎక్కువ స్థాయిలోనే పెట్టుకున్నా పెద్ద ఆశ్చర్య పడక్కర్లేదు అనే చెప్పాలి.300 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలోనే రానంత పెద్ద యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతూ ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 15 విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు