సాహో మొదటి వారం నైజాం షేర్.

సాహో మొదటి వారం నైజాం షేర్.

Published on Sep 6, 2019 12:47 PM IST

సాహో మూవీ కలెక్షన్స్ బాగా తగ్గుముఖం పట్టాయి. సెలవు రోజులైనా శని, ఆదివారాలతో పాటు సోమవారం పండుగ దినం కావడంతో సాహో వసూళ్ల జోరు కొనసాగింది. వర్కింగ్ డే అయినా మంగళ వారం నుండి సాహో కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. నైజాంలో కూడా సాహో వసూళ్లు అంత ఆశాజనకంగా లేవు.

ఏడవరోజైన గురువారం సాహో నైజాం ఏరియాలో 52లక్షల షేర్ రాబట్టింది. దీనితో సాహో మొదటివారం పూర్తయ్యేనాటికి 26కోట్ల షేర్ రాబట్టింది. ఐతే సాహో మొదటివారానికి నాన్ బాహుబలి రికార్డు ని సొంతం చేసుకుంది. కానీ ఇంకా 14కోట్ల వసూళ్లు సాధిస్తే కానీ, సాహో నైజాంలో బ్రేక్ ఈవెన్ చేరుకోదు. కాగా సాహో ఇంత మొత్తం వసూళ్లను రాబట్టే అవకాశం చాలా తక్కువ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు