సాహో నైజాం ఏరియా మొదటివారం కలెక్షన్స్ రిపోర్ట్.

సాహో నైజాం ఏరియా మొదటివారం కలెక్షన్స్ రిపోర్ట్.

Published on Sep 2, 2019 1:29 PM IST

ప్రభాస్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో నైజాం ఏరియాలో గట్టి వసూళ్లనే రాబడుతుంది. మొదటి రోజు ఏకంగా 9.4కోట్ల షేర్ సాధించి బాహుబలి 2 రికార్డుని దాటేసిన సాహో మిగతా రెండు రోజులకు గాను దాదాపు 10 కోట్లకు పైగా షేర్ రాబట్టి 20కోట్ల మార్కును చేరుకుంది. వారాంతం ముగిసినప్పటికీ ఇంకా నేడు వినాయక చతుర్థి సందర్భంగా సెలవు కావడంతో ఈరోజు కూడా సాహో మంచి వసూళ్లను రాబట్టే అవకాశం కలదు.

ఇక సాహో హిందీ వర్షన్ కూడా మూడు రోజులకు గాను 79 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు కలెక్షన్స్ వైపుగా దూసుకుపోతుంది. ఐతే ఇక రేపటి నుండి సాహోకి అసలు పరీక్ష మొదలుకానుంది. మరి సెలవుదినాలు ముగిసిన అనంతరం సాహో ఏ స్థాయి వసూళ్లు సాధిస్తుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు