సాహో దెబ్బకి బాలీవుడ్ బాక్సాపీస్ బద్దలవుతుందిగా

సాహో దెబ్బకి బాలీవుడ్ బాక్సాపీస్ బద్దలవుతుందిగా

Published on Sep 6, 2019 9:35 PM IST

ప్రభాస్ సాహో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. విడుదలైన మొదటి రోజునుండి సాహో కలెక్షన్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. సాహో విడుదలై ఏడురోజులు పూర్తయిన నేపథ్యంలో మొదటివారానికి గాను 116కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. ఒక సౌత్ హీరో మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకొని ఈ రేంజ్ వసూళ్లు సాధించడం మాములు విషయం కాదు .

మొదటి రోజు 24.40 కోట్ల వసూళ్లు సాధించిన సాహో రెండవ రోజు 25.20 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఆదివారం అత్యధికంగా 29.48 కోట్ల వసూళ్లు సాధించింది. సోమవారం నుండి వరుసగా 14.20 కోట్లు, 9.10కోట్లు, 6.90కోట్లు , 6.75కోట్ల వసూళ్లతో అదరగొట్టింది. ఈ ఏడాదికి అత్యధిక మొదటివారం వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగువ స్థానంలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు