బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి వర్సస్ సాహో.

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి వర్సస్ సాహో.

Published on Sep 2, 2019 11:23 AM IST

భయంకరమైన నెగెటివ్ టాక్ తో మొదలైన సాహో హిందీ వర్షన్ అద్భుత కలెక్షన్స్ రాబడుతుంది. సాహో మేనియాకు మరియు ప్రభాస్ పాపులారిటీకి ఇదే నిదర్శనం. అసలు రివ్యూలు పట్టించుకోకుండా హిందీ జనాలు సాహో థియేటర్లకు పోటెత్తుతున్నారు. మొదటి రోజు 24.4కోట్లు వసూళ్లు సాధించిన సాహో,రెండవ రోజు 25.2కోట్లు, మూడవ రోజు 29.48 కోట్ల వసూళ్ల తో వీకెండ్ ముగిసే నాటికి 79.08 కోట్ల వసూళ్లు సాధించింది.

ఇక బాలీవుడ్ లో బాహుబలి మరియు సాహో చిత్రాల మొదటివారం కలెక్షన్స్ చూస్తే బాలీవుడ్ లో ప్రభాస్ సినిమాలు ఎంత ప్రభావం చూపుతున్నాయో అర్థం అవుతుంది. బాహుబలి ది బిగినింగ్ మొదటివారంతానికి గాను 22.35 కోట్ల వసూళ్లు సాధించగా, బాహుబలి 2, 128కోట్ల తో అల్ టైం రికార్డు నెలకొల్పింది. లేటెస్ట్ సాహో 79.08 కోట్ల మొదటి వీకెండ్ వసూళ్లతో దుమ్మురేపింది. ఈ మొత్తం బాహుబలి మొదటి పార్ట్ వసూళ్ల కంటే మూడురెట్లు అధికం కావడం గమనార్హం.

రజిని కాంత్ తరువాత బాలీవుడ్ లో ఆ స్థాయి మార్కెట్ కలిగిన హీరోగా ప్రభాస్ తన సత్తా చాటుతున్నాడు. ఇంకొంచెం బెటర్ టాక్ తెచ్చుకొని ఉంటే సాహో బహుశా బాహుబలి 2 వసూళ్లను అధిగమించేదేమో అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు