సాహో 102 నాట్ అవుట్. అక్కడ హిట్ పక్కా…!

సాహో 102 నాట్ అవుట్. అక్కడ హిట్ పక్కా…!

Published on Sep 4, 2019 2:50 PM IST

సాహో హిందీ వర్షన్ కలెక్షన్స్ పరంగా అదరగొడుతుంది. ఆశ్చర్యకరంగా తెలుగు రాష్ట్రాలకు మించి నార్త్ ఇండియాలోని గుజరాత్, బీహారు, యూపీ వంటి రాష్ట్రాలలో ఈ చిత్రం అంత్యంత ఆదరణ దక్కించుకుంటుంది. మొదటి నాలుగు రోజులకు గానూ 93కోట్ల వసూళ్లు సాధించిన సాహో మంగళవారం కూడా ఆ ఊపుని కొనసాగించింది. వర్కింగ్ డే అయినప్పటికీ మంగళవారం ఈ చిత్రం 9.10 కోట్ల వసూళ్లు సాధిచింది. దీనితో మొత్తంగా ఐదు రోజులకు గాను సాహో 102 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం.

మరో రెండు రోజులలో బ్రేక్ ఈవెన్ చేరుకోనున్న సాహో హిందీ వర్షన్ కి ఇక లాభాలు మొదలు కానున్నాయి. దారుణమైన టాక్ తో మొదలైన సాహో బాక్సాపీస్ ప్రయాణంగా ఇంత విజయవంతంగా సాగడం అభినందనీయం. దీనితో నార్త్ ఇండియాలో ప్రభాస్ పాపులారిటీ ఏమేర ఉందో అర్థం అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు