నైజాంలో సాహో షాకింగ్ కలెక్షన్స్

నైజాంలో సాహో షాకింగ్ కలెక్షన్స్

Published on Sep 5, 2019 9:15 AM IST

సాహో చిత్ర వసూళ్లలో ఆరవ రోజు భారీ తగ్గుదల కనిపించింది. మిగతా ప్రాంతాలతో పోల్చితే కొంచెం చెప్పుకోదగ్గ వసూళ్లు కురిపిస్తున్న నైజాం ఏరియాలో కూడా సాహో వసూళ్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఐదవరోజు 1.49 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం, నిన్న బుధవారం కేవలం 61లక్షల షేర్ మాత్రమే సాధించగలిగింది. అంటే ఐదవ రోజు వసూళ్ళలో కనీసం సగం షేర్ కూడా రాబట్టలేదు. మొత్తం ఆరు రోజులకు గానూ సాహో నైజాంలో 25.37 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తుంది.

సాహో నైజాం థియరిటిల్ రైట్స్ 40కోట్లకు పైగా అమ్మిన నేపథ్యంలో ఇంకా 16కోట్ల షేర్ రాబడితే తప్ప సాహో బ్రేక్ ఈవెన్ కి చేరుకోదు. వచ్చేవారం కూడా చెప్పుకోదగ్గ పెద్ద సినిమాల విడుదల లేని కారణంగా సాహో వచ్చే వారాంతంలో మరికొన్ని మెరుగైన వసూళ్లు రాబట్టే అవకాశం కలదు. ఐతే 16కోట్ల వసూళ్లు సాధించడం మాత్రం కష్టం అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు