అక్కడ వంద కోట్లకు చేరువలో సాహో

అక్కడ వంద కోట్లకు చేరువలో సాహో

Published on Sep 3, 2019 9:30 AM IST

సాహో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. వారాంతం ముగిసేనాటికి మొదటి మూడురోజులకు గాను 79 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన సాహో పండగ రోజైన సోమవారం 14.85 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. దీనితో కలిపి మొత్తంగా ఇండియా వైడ్ గా సాహో హిందీ వర్షన్ దాదాపు 94 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది. ఇక గురువారం సాహో వంద కోట్ల మార్కు చేరుకొంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ సాహోకి మొదటి షో నుండే దారుణమైన రివ్యూలు ఇచ్చిన నేపథ్యంలో ఇలాంటి ఆదరణ దక్కడం ప్రభాస్ స్టార్ డమ్ ని తెలియజేస్తుంది. ఒక సౌత్ ఇండియన్ హీరో సినిమాకి నెగెటివ్ టాక్ తర్వాత కూడా ఇంత మంచి కలెక్షన్స్ రావడం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు