రెండవ రోజు సైతం వసూళ్ల వర్షం కురిపించిన ‘సాహో’

రెండవ రోజు సైతం వసూళ్ల వర్షం కురిపించిన ‘సాహో’

Published on Sep 1, 2019 4:39 PM IST

భారీ అంచనాల నడుమ శుక్రవారం విడుదలైన ‘సాహో’ చిత్రం ముందు నుండి ఊహించినట్టే వసూళ్ల వర్షం కురిపస్తోంది. ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళం, మలయాళం ఇలా అన్ని చోట్ల లీడింగ్ వసూళ్లతో దూసుకుపోతోంది. తొలిరోజు తెలుగు, తమిళం, మలయాళంలో కలిపి రూ. 75 కోట్లు, హిందీలో రూ.24 కోట్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల పైచిలుకు గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు కూడా అదే హవా చూపింది.

మొదటి రోజు ఏర్పడిన నెగెటివ్ టాక్ వసూళ్లపై ప్రభావం చూపుతుందేమోనని ట్రేడ్ వర్గాలు భావించగా అలాంటిదేమీ జరగలేదు. మొదటి రోజుతో సమానంగా రెండవరోజు వసూళ్లు ఉన్నాయి. ప్రస్తుత అధికారిక లెక్కల మేరకు చిత్రం రెండు రోజులకు కలిపి రూ.205 కోట్ల గ్రాస్ వసూలైనట్టు తెలుస్తోంది. ఇక ఈరోజు ఆదివారం కాబట్టి వసూళ్లలో పెద్దగా డ్రాప్ ఉండకపోవచ్చు. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు చిత్రాన్ని బ్రహ్మాండమైన రీతిలో ఆదరిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల పైగా బడ్జెట్ కేటాయించి వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు