‘సాహో’ నైజాం లేటెస్ట్ కలెక్షన్స్ !

‘సాహో’ నైజాం లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Sep 1, 2019 11:07 AM IST

సుజిత్ దర్శకత్వంలో అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో ప్ర‌భాస్ హీరోగా తెరెకెక్కిన్న ‘సాహో’ చిత్రం ఆశించిన స్థాయిలో టాక్ ను సొంతం చేసుకోలేకపోయినా… బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రస్తుతానికి బాగానే కలెక్షన్స్ ను రాబడుతున్నాడు. టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు వసూళ్ల వర్షం కురిపించింది ఈ సినిమా. ముఖ్యంగా నైజాంలో, ఈ చిత్రం మొదట 2 రోజులు కెలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. శనివారం నాడు నైజాంలో ‘సాహో’ రూ .5 కోట్లకు పైగా థియేట్రికల్ షేర్ ను రాబట్టగా… మొత్తం 2 రోజులకు గానూ నైజాం షేర్ రూ .14.42 కోట్లుగా ఉంది. ఇక ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాల బాగున్నాయి.

కాగా సాహో మొదటి రోజు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఇక టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాల బాగుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు