‘సాహో’ సీడెడ్ లేటెస్ట్ కలెక్షన్స్ !

‘సాహో’ సీడెడ్ లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Sep 6, 2019 2:06 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన ‘సాహో’ చిత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం బలమైన ఓపెనింగ్స్ సాధించింది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా సీడెడ్ ఏరియాలో 10 కోట్ల మార్కును దాటింది. యూఎస్ లో కూడా ఈ వారం చివరి నాటికి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 3 మిలియన్ మార్కుకు చేరుకుంటుందని ట్రేడ్ వర్గాకు అంచనా వేస్తున్నాయి.

కాగా టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ.. ఈ చిత్రానికి ఈ వారం వచ్చే కలెక్షన్స్ ను బట్టే బాక్సాఫీస్ వద్ద ‘సాహో’ రేంజ్ ఏంటో తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు