‘సాహో’ లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్ !

‘సాహో’ లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్ !

Published on Sep 5, 2019 1:02 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన ‘సాహో’ చిత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం బలమైన ఓపెనింగ్స్ సాధించింది. తాజాగా ఈ సినిమా యూఎస్ లో ఇప్పటివరకు $2,772,700 కలెక్షన్స్ సాధించింది. ఈ వారం చివరి నాటికి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 3 మిలియన్ మార్కుకు చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాగా టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ.. ఈ చిత్రానికి ఈ వారం వచ్చే కలెక్షన్స్ ను బట్టే బాక్సాఫీస్ వద్ద ‘సాహో’ రేంజ్ ఏంటో తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు