ఈ రోజు విడుదల కానున్న విక్రమ్ ‘సామీ స్క్వేర్ ‘ మోషన్ పోస్టర్ !
Published on May 17, 2018 10:19 am IST

హీరో చియాన్ విక్రమ్, కీర్తి సురేష్ జంటగా హరి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సామీ స్క్వేర్’. విక్రమ్ ,త్రిష జంటగా 2003 లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సామి’కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్ర మోషన్ పోస్టర్ ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకి రిలీజ్ చేయన్నునారు. హీరో విక్రమ్ కి తెలుగులో కూడా అభిమానులున్నారు. కనుక ఈ చిత్రం తెలుగులోనూ అనువాదం కానుంది. సామి సినిమాకి కొనసాగింపుగా వస్తున్న సామీ స్క్వేర్ పై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తమీన్స్ ఫిలిమ్స్ పతాకంపై శిబు తమీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook