శబ్దం: మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో “వైశాలి” కాంబినేషన్!

శబ్దం: మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో “వైశాలి” కాంబినేషన్!

Published on Apr 12, 2024 9:27 PM IST

ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అరివజగన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ శబ్దం. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన వైశాలి అనే క్రైమ్ థ్రిల్లర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో ఆడియెన్స్ ముందుకి వచ్చారు. ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయడం జరిగింది.

టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. క్రైమ్ ను ఇన్వెస్టిగేట్ చేసే పాత్రలో ఆది కనిపించారు. టైటిల్ కి తగినట్లు గా కొన్ని సన్నివేశాలు చూపించారు. విజువల్స్ పరంగా టీజర్ ఆకట్టుకుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ ను మరింత హైలైట్ చేసింది అని చెప్పాలి. సిమ్రాన్, లైలా, లక్మీ మీనన్, రిడిన్ కింగ్స్లీ, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మీనన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు