‘లింగ’ చిత్ర బృందం తో కలవనున్న సబు సైరిల్

Sabu-Cyril
రజనీ కాంత్ నటిస్తున్న ‘లింగ’ చిత్ర బృందంతో ప్రముఖ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ సబు సైరిల్ కలవనున్నారు. ప్రస్తుతం ఇతను ఎస్ఎస్ రాజమౌళి నిర్మిస్తున్న బాహుబలి చిత్రంలో పనిచేస్తున్నాడు. సబు సైరిల్ ఐదు సంవత్సరాల తరువాత మళ్ళీ రజనీకాంత్ తో కలిసి పనిచేస్తున్నాడు. ఇతను గతంలో రోబో సినిమా లో రజనీ తో కలిసి పనిచేశాడు.

అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా లు ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కేఎస్ రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైసూర్ లో ఈ చిత్రాన్ని ఇటీవలే లాంచ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కొద్ది రోజుల్లో మొదలవనుంది. ఆ తరువాత దాదాపు 40 రోజుల పాటు హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

మే 9 న విడుదలకు సిద్దంగా ఉన్న రజనీ కాంత్ నటించిన విక్రమ సింహ పైనే అందరి చూపులు ఉన్నాయి. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అంత భారీ మొత్తాన్ని ఈ చిత్రం రాబట్టుకుంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. రజనీ కాంత్ కుమార్తె సౌందర్య రజనీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Exit mobile version