ఇంటర్వ్యూ : సచిన్‌ జోషి – ఇది క్లాసిక్ హర్రర్ ఫిల్మ్.

Published on Feb 2, 2019 5:36 pm IST

సచిన్‌జోషి – నర్గీస్ ఫక్రీ కాంబినేషన్‌లో రాగిణి ఎంఎంస్ ఫేం భూషణ్ పటేల్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘అమావాస్’. మోనా జ‌స్బీర్ సింగ్‌. అలీ అస్గ‌ర్ అగా, న‌వ్‌నీత్ కౌర్ దిల్లాన్‌, వివ‌న్ బ‌తేనా ముఖ్య పాత్ర‌లు పోషించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుంది. కాగా ఈ సందర్భంగా సచిన్‌ జోషి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

చాలా గ్యాప్ తరువాత మళ్లీ ‘అమావాస్’ అని వస్తున్నారు ?

ఓ డిఫరెంట్ ఫిల్మ్ చెయ్యాలని వెయిట్ చేస్తున్న క్రమంలో మా డైరెక్టర్ భూషణ్ పటేల్ గారు చెప్పిన, ఈ అమావాస్ స్టోరీ బాగా నచ్చి ఈ సినిమా చేశాను. నా గత సినిమాలకి ఈ సినిమా చాలా బిన్నంగా ఉంటుంది.

ఈ సినిమా ప్రోమోలు చూస్తుంటే.. ఇది పూర్తిగా హారర్ నేపథ్యంలో సాగుతున్నట్లు అనిపిస్తోంది ?

అవును అండి. ఇది పూర్తిగా హర్రర్ నేపథ్యంలోనే సాగుతుంది. సినిమాలోని కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. అలాగే డైరెక్టర్ భూషణ్ పటేల్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే.. అమావాస్ ఒక క్లాసిక్ హర్రర్ ఫిల్మ్.

సినిమాలో ఏ అంశాలు చూసి మీరు క్లాసిక్ హర్రర్ ఫిల్మ్ అని చెప్తున్నారు ?

ఫస్ట్ రెగ్యూలర్ గా వచ్చే హర్రర్ సినిమాలా ఉండదు ఈ సినిమా. మెయిన్ గా సినిమాలో కనిపించే వి.ఎఫ్.ఎక్స్ చాలా కొత్తగా, వైవిధ్యంగా ఉంటాయి. అన్నిటికి మించి ‘అమావాస్’లో ఆకట్టుకునే గొప్ప స్టోరీ ఉంది. సినిమాకే స్టోరీ హైలెట్ గా నిలుస్తోంది. అదేవిధంగా ఇంటర్నల్ గా సినిమాలో ఒక యూనిక్ స్క్రీన్ ప్లే ఉంటుంది.

ఈ సినిమా హిందీ మరియు తెలుగులో విడుదల కాబోతుంది. అంటే రెండు భాషల్లోనూ షూట్ చేశారా ?

అవును, ఈ సినిమాని రెండు భాషల్లోనూ తెరకెక్కించాము. కాకపోతే తెలుగులో క్లోజ్ షాట్స్ వరకు సెపెరేట్ గా తీశాము. రెండు భాషల్లోనూ మా సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నాము.

ఈ సినిమాలో మీకు జోడిగా నటించిన హీరోయిన్ నర్గీస్ ఫక్రీ గురించి చెప్పండి ?

నర్గీస్ ఫక్రీ చాలా బాగా చేసింది. తను హార్డ్ వర్కర్. ప్రతి సీన్ చేసే ముందు, ఆ సీన్ లోని సోల్ ను పట్టుకొని యాక్ట్ చెయ్యటానికి ట్రై చేసేది.

మీ డైరెక్టర్ గురించి చెప్పండి ?

ఆయన హర్రర్ ఫిల్మ్ స్పెషలిస్ట్. పైగా ఈ సారి కథనే చాలా కొత్తగా రాసారు. ఇక ఆయన ఇప్పటివరకూ తీసిన నాలుగు సినిమాలు హర్రర్ సినిమాలే. ఒక హర్రర్ సినిమాకు ఏమి కావాలో ఆయనకు బాగా తెలుసు. ఈ జోనర్ అంటే ఆయనకు బాగా ఇష్టం. ఆయన చూసి నాక్కూడా ఈ జోనర్ పై ఇష్టం పెరిగింది. ఇప్పుడు ప్రతి హర్రర్ ఫిల్మ్ చూస్తున్నాను.

మీ తదుపరి చిత్రాలు గురించి చెప్పండి ?

ఒకటి రెండు స్టోరీస్ విన్నాను. చాలా బాగున్నాయి. అయితే నెక్స్ట్ సినిమా ఏం చెయ్యాలో ఇంకా నిర్ణయించుకోలేదు. మా ‘అమావాస్’ రిలీజ్ అయిన తరువాతే, ఏ జోనర్ లో ఎలాంటి సినిమా చెయ్యాలో ఆలోచిస్తాను.

సంబంధిత సమాచారం :