విశ్వాసం సెట్ లో డ్యాన్సర్ మృతి … షాక్ లో అజిత్ !

విశ్వాసం సెట్ లో డ్యాన్సర్ మృతి … షాక్ లో అజిత్ !

Published on Nov 8, 2018 11:28 AM IST

తమిళ స్టార్ హీరో తల అజిత్ ప్రస్తుతం ‘విశ్వాసం’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్ర షూటింగ్ పూణే లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈచిత్రీకరణ సమయంలో ఒక డ్యాన్సర్ గుండె పోటు తో మరిణించాడు. దాంతో షాక్ గురైన అజిత్ ప్రైవేట్ ఫ్లైట్ ను అరేంజ్ చేసి మృతదేహాన్ని చెన్నై తరలించే ఏర్పాటు చేశాడు.

అంతేకాకుండా ఆ చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు అయ్యే ఖర్చు తో పాటు అతని కుటుంబానికి 8లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు అజిత్. ఈవిషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో అజిత్ చేసిన పనిని మెచ్చుకుంటూ ఆయన ఫై నెటీజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు