విషాదం : దర్శకుడు త్రినాథరావు నక్కిన కు పితృ వియోగం

విషాదం : దర్శకుడు త్రినాథరావు నక్కిన కు పితృ వియోగం

Published on Apr 30, 2024 2:37 PM IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర దర్శకునిగా వచ్చి వరుస హిట్స్ తో మంచి బ్రాండ్ ని సెట్ చేసుకున్న దర్శకుల్లో ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన కూడా ఒకరు. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ లని అందించిన తాను రీసెంట్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తో ఓ సినిమాని అనౌన్స్ చేసారు. మరి గ్రాండ్ గా ఈ సినిమా లాంచ్ కాగా ఇప్పుడు ఓ విషాద వార్త అయితే బయటకి వచ్చింది.

త్రినాథరావు నక్కిన తండ్రి సూర్యారావు గారు ఈరోజు కాలం చేసినట్టుగా ఇప్పుడు వార్తలు బయటకి వచ్చాయి. దీనితో దర్శకుని ఇంట విషాదం నెలకొంది. త్రినాథరావు నక్కిన కుటుంబం ఉత్తరాంధ్ర, అనకాపల్లి లోనే నివాసం ఉంటుండగా రేపు తమ తాజా చిత్రం హీరో సందీప్ కిషన్ అలాగే నిర్మాత రాజేష్ దండ వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించనున్నట్టుగా తెలుస్తుంది. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు