వెస్ట్రన్ బీట్ లో హెట్టెక్కించే స్టెప్స్ తో “సాహో” సాంగ్.

వెస్ట్రన్ బీట్ లో హెట్టెక్కించే స్టెప్స్ తో “సాహో” సాంగ్.

Published on Jul 8, 2019 11:41 AM IST

ముందుగా చెప్పిన విధంగానే “సాహో” సైకో సైయాన్ సాంగ్ ని యూట్యూబ్ లో కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు చిత్ర యూనిట్. ఓ పబ్ వాతావరణంలో బ్యూటీ శ్రద్దా కపూర్ హాట్ స్కర్ట్ లో హీటెక్కించే స్టెప్స్ వేస్తుంటే , ప్రభాస్ కూడా తనదైన స్టైల్ లో ఆ పాటకి కాలు కదిపారు. పాటలో మాత్రం తెలుగు నేటివిటీ మిస్సయింది అనిపించినా ఊపుతెప్పించి వెస్ట్రన్ బీట్స్ తో అలరించేలా ఉంది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న “సాహో” మూవీ పాటలు కూడా అదే స్థాయిలో ఉండేలా డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడనిపిస్తుంది.

ఈ పాటకు బాలీవుడ్ కంపోజర్ తనిష్క్ బాఘ్చి స్వరాలు అందించగా,శ్రీజో రచించడం జరిగింది. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్,ధ్వని భానుశాలి, తనిష్క్ బాఘ్చి అద్భుతంగా పాడారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. యూవీ క్రియేషన్స్,టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్,మురళి శర్మ,వెన్నెల కిషోర్,జాకీ ష్రాఫ్ వంటి నటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు