విడుదల తేదీని ఖరారు చేసుకున్న చిత్రలహరి !

Published on Jan 15, 2019 11:21 am IST

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ‘నేను శైలజ’ ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ ‘చిత్ర’ పాత్రలో నటిస్తుండగా .. నివేత పేతురాజ్ ‘లహరి’ పాత్రలో కనిపించనుంది.

కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12వ తేదీన విడుదల కానుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రూపొందించనున్నారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో తేజు గడ్డంతో కొత్తలుక్ లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More