కల్కి: అశ్వథ్థామ ఇంట్రో వీడియో పై సాయి ధరమ్ కామెంట్స్!

కల్కి: అశ్వథ్థామ ఇంట్రో వీడియో పై సాయి ధరమ్ కామెంట్స్!

Published on Apr 21, 2024 11:01 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ కెరీర్ లో దూసుకు పోతున్నారు. గతేడాది సలార్ (Salaar) చిత్రం తో ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న ఈ హీరో, తదుపరి కల్కి 2898AD (Kalki 2898AD) చిత్రం లో కనిపించనున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ వరల్డ్ మూవీ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

నేడు బిగ్ బి రోల్ కి సంబందించిన చిన్న వీడియో ఒకటి రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్ అశ్వథ్థామ గా కనిపించనున్నారు. ఈ న్యూస్ ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఈ వీడియో పై యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఈ చిత్రం కోసం వేచి ఉండలేను అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక బ్రిలియంట్ వీడియో అంటూ ఇంట్రో వీడియో పై ప్రశంసల వర్షం కురిపించారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి మరియు నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్ ను అభినందించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు