రెక్కీలో “గాంజా శంకర్” దర్శకుడు.!

రెక్కీలో “గాంజా శంకర్” దర్శకుడు.!

Published on Dec 10, 2023 7:00 AM IST

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాది తన కెరీర్ లో మంచి వసూళ్లు అందుకొని అదరగొట్టాయి. మరి ఆ రెండు చిత్రాలు అనంతరం తేజ్ అనౌన్స్ చేసిన ఓ సాలీడ్ మాస్ చిత్రమే “గాంజా శంకర్”. దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన పక్కా మాస్ సబ్జెక్టు ఇది. దీనితో ఈ సినిమాపై మంచి బజ్ అయితే ఇప్పుడు నెలకొంది.

ఇక ఈ సినిమాపై దర్శకుడు సంపత్ నంది లేటెస్ట్ అప్డేట్ అందించాడు. ప్రస్తుతం అయితే తాను తన డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ కలిసి లొకేషన్స్ రెక్కీ లో ఉన్నట్టుగా తెలిపాడు. దీనిపై కొన్ని ఫొటోస్ కూడా తాను షేర్ చేసాడు.. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ 4 సినిమాస్ వారు కలిసి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు