పార్ట్ 2 ఉంది కాబట్టే హింట్ ఇచ్చాం – సాయి ధరమ్ తేజ్

Virupaksha
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సైతం మంచి వసూళ్లను రాబడుతోంది. తాజాగా నెటిజన్స్ తో హీరో సాయి ధరమ్ తేజ్ ఆస్క్SDT పేరుతో ముచ్చటించారు.

అయితే నెటిజన్స్ తో హీరో సాయి పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. విరూపాక్ష పార్ట్ 2 ఉంది కాబట్టే హింట్ ఇచ్చాం అని అన్నారు. హీరోయిన్ లలో తన క్రష్ ఎవరు అని ఒకరు అడగగా, సమంత అంటూ చెప్పుకొచ్చారు. హీరో సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరూపాక్ష మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.

Exit mobile version