సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా వివరాలు !

మైత్రి మూవీస్ సంస్థలో కిషోర్ తిరుమల నానితో సినిమా చెయ్యాలి. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల నాని స్థానంలో సాయి ధరమ్ తేజ్ చేస్తున్నాడు. ఈ సినిమా జూన్ నుండి ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ వర్క్స్ పూర్తి అయిన ఈ మూవీ కి సంభందించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలో అన్ని వివరాలు మీడియాతో పంచుకోబోతున్నారు చిత్ర యూనిట్.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కరుణాకరన్ దర్శకత్వంలో ఒక లవ్ స్టోరిలో నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ హైదారాబాద్ పరిసర ప్రాంతాలో జరుగుతోంది. ప్రముఖ రచయిత డార్లింగ్ స్వామి ఈ సినిమాకు మాటలు రాస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.ఎస్.రామారావ్ నిర్మిస్తున్నారు.

Exit mobile version