కొత్త సినిమా కోసం కొత్త లుక్ లో క‌నిపించ‌నున్న మెగా హీరో..?

కొత్త సినిమా కోసం కొత్త లుక్ లో క‌నిపించ‌నున్న మెగా హీరో..?

Published on Jun 23, 2024 2:01 AM IST

మెగా సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తాజాగా త‌న కొత్త సినిమాను అనౌన్స్ చేయ‌డంతో అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘బ్రో’ మూవీ త‌రువాత తేజు చేస్తున్న సినిమా కావ‌డంతో, ఈసారి ఎలాంటి సినిమాతో వ‌స్తాడా అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఉన్నారు.

ఇక ఈ సినిమాను రోహిత్ అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను పీరియాడిక్ స‌బ్జెక్ట్ తో స‌రికొత్త కాన్సెప్ట్ తో తెర‌కెక్కించేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్ పాత్ర చాలా కొత్త‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా కోసం తేజు ఓ స‌రికొత్త లుక్ లో క‌నిపిస్తాడ‌ట‌. ఇప్ప‌టికే ప‌లు టెస్ట్ లుక్ లు జ‌ర‌గ్గా, ఓ లుక్ ను మేక‌ర్స్ ఫైన‌ల్ చేశార‌ట‌.

దీంతో తేజు త‌న కెరీర్ లోని 18వ సినిమాలో ఎలాంటి లుక్ లో క‌నిపిస్తాడా అని అభిమానులు ఆతృత‌గా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలోని మిగ‌తా క్యాస్టింగ్, టెక్నిక‌ల్ టీమ్ గురించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాను ‘హ‌ను-మాన్’ మూవీ నిర్మాత నిరంజ‌న్ రెడ్డి అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు