
‘రేయ్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాలలో తన డాన్సులతో, యాక్షన్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్. తన మూడవ సినిమా కోసం క్రేజీ డైరెక్టర్, సూపర్ హిట్ చిత్రాల నిర్మాతతో జత కలిసాడు. వారే హరీష్ శంకర్ – దిల్ రాజు. వీరి ముగ్గురి కాంబినేషన్ లో రానున్న సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. ప్రస్తుతం హరీష్ శంకర్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటే దిల్ రాజు సినిమాని సెప్టెంబర్ 24న రిలీజ్ చెయ్యడానికి పన్ని పనులు పూర్తి చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం తెలిపిన దాని ప్రకారం మొదటి రెండు సినిమాలకంటే ఎక్కువగా సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో అన్ని రకాలుగా మెప్పిస్తాడని అంటున్నారు. మెగా అభిమానులు ఆశించే డాన్సులు,ఫైట్స్ తో పాటు తేజు తన కామెడీ టైమింగ్ తో మరియు ఎమోషనల్ సీన్స్ తో కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాడని తెలిపారు. హరీష్ శంకర్ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా సినిమాని ప్లాన్ చేసినట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ సరసన రెండవసారి రెజీన జంట కట్టిన ఈ సినిమాలో ఆద శర్మ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. మిక్కీ జె మేయర్ అందించిన పాటలు, రిలీజ్ అయిన ట్రైలర్స్ ఇప్పటికే సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.