నవంబర్ నుండి మొదలుకానున్న మెగా హీరో సినిమా

నవంబర్ నుండి మొదలుకానున్న మెగా హీరో సినిమా

Published on Oct 7, 2019 10:44 AM IST

‘చిత్రలహరి’ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా కొత్త సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొత్త దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేయనున్నాడు. ఇంతకుముందే తెలిపినట్టు ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే టైటిల్ నిర్ణయిచారు. ఈరోజే పూజా కార్యక్రమాలతో చిత్రం ప్రారంభమైంది.

ఇక రెగ్యులర్ షూట్ నవంబర్ నుండి మొడలుకానుంది. ఈలోపు తేజ్ మారుతి డైరెక్షన్లో చేస్తున్న ‘ప్రతిరోజు పండగే’ చిత్రాన్ని పూర్తిచేయనున్నాడు. ఈ సినిమాలో నభా నటేష్ కథానాయకిగా నటించనుంది. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతాన్ని అందివ్వనున్నారు. ఈ చిత్రం రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటెర్టైనర్ గా ఉండనుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు