సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ మొదలైంది..!

సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ మొదలైంది..!

Published on Sep 23, 2015 9:48 AM IST

sai-dharam-tej
‘పిల్లా.. నువ్వులేని జీవితం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో సాయిధరమ్ తేజ్. మొదటి సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుస సినిమాలతో బిజీ అయిపోయిన ఈ హీరో, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో రేపట్నుంచి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఇక ఇదిలా ఉంటే.. ఓపక్క ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాను విడుదలకు సిద్ధం చేసి, మరోపక్క ‘తిక్క’ అనే సినిమా షూటింగ్ పూర్తి చేస్తూనే మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టి సాయిధరమ్ తేజ్ సూపర్ ఫాస్ట్‌గా దూసుకుపోతున్నారు.

నిర్మాత దిల్‌రాజుతో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన తేజ్, దిల్‌రాజుతోనే మరో రెండు సినిమాలు ప్లాన్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సినిమాల్లో ఒకటైన ‘సుప్రీమ్’ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో దిల్‌రాజు ఆఫీస్‌లో లాంచనంగా ప్రారంభమైంది. పటాస్ సినిమాతో దర్శకుడిగా మెప్పించిన అనిల్ రావిపూడి, తన రెండో సినిమాను కూడా మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 5నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక సాయిధరమ్ తేజ్ హీరోగా దిల్‌రాజు నిర్మించనున్న మరో సినిమా ‘శతమానం భవతి’ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు