హీరోయిన్ తో మెగా హీరో సెల్ఫీ

Published on Jul 23, 2019 1:34 pm IST

ఇటీవల “చిత్రలహరి” చిత్రంతో ఓ క్లాసిక్ హిట్ ని తన ఖాతా లో వేసుకున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఆయన తాజాగా కామెడీ,రొమాంటిక్ చిత్రాల దర్శకుడు మారుతీ దర్శకత్వంలో “ప్రతి రోజు పండగే” అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. త్వరలో రాజమండ్రిలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

“ప్రతి రోజు పండగే” చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. కాగా షూటింగ్ సెట్ లో హీరో ధరమ్ తేజ్ తో దిగిన సెల్ఫీ ఫోటో ఒకటి రాశి ఖన్నాతన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటో కి మెగా ఫ్యాన్స్ తో పాటు రాశి ఫ్యాన్స్ లైక్స్ కొడుతూ పండుగ చేసుకుంటున్నారు.

సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు

సంబంధిత సమాచారం :