ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో హీరోగా తొలి అడుగు వేస్తున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. సినిమా విజయవంతం కావాలని కోరుతూ బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల ఆలయాన్ని హీరో సందర్శించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితుల నుండి వేద ఆశీర్వచనాలు పొందారు.
సాయి ధరమ్ తేజ్ సరసన రెజీనా హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. రవి కుమార్ చౌదరి దర్శకత్వంలో అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయి. సినిమా గ్యారెంటీ హిట్ అనే టాక్ అభిమానులలో వినిపిస్తుంది.


