హీరోలతో గొడవలఫై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి !
Published on Aug 1, 2018 2:00 pm IST

ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తన నటనతో అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ఈ చిత్రం ఆ రేంజ్ లో హిట్ కావడానికి ఆమె కూడా ఒక ప్రధాన కారణం, ఇక ఈ సినిమా తరువాత నాని తో కలిసి ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్ ‘అనే చిత్రంలో నటిచింది. ఈచిత్రం కూడా మంచి విజయాన్ని సాధిచింది. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో నాని తో సాయి పల్లవి గొడవ పెట్టుకుందని వార్తలు వచ్చాయి. ఇక ఈ సినీమాతరువాత ఆమె ‘కణం’ అనే సినిమా షూటింగ్ లో యువ హీరో నాగశౌర్య తో గొడవ జరిగిందని మళ్లీ వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని నాగశౌర్య కూడా ఒప్పుకున్నాడు.

ఇక ఇప్పుడు సాయి పల్లవి మరో గొడవ తో వార్తల్లోకెక్కింది ప్రస్తుతం ఆమె శర్వానంద్ తో కలిసి ‘పడి పడి లేచే మనుసు’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈచిత్ర షూటింగ్ సంధర్బంగా శర్వానంద్ కి సాయి పల్లవి గొడవ జరిగిందని దాంతో శర్వా షూటింగ్ ఆపేసాడని వార్తలు వచ్చాయి. ఈ విషయం ఫై సాయి పల్లవి స్పందిస్తూ శర్వా తో ఎలాంటి గోడవ జరుగలేదు. ఆయన ఈ చిత్రం తో పాటు మరొక చిత్రంలో నటిస్తున్నారు. అందుకే ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారని క్లారిటి ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook