సాయి పల్లవి ఆ సీన్ లో నిజంగానే ఏడ్చేసిందట !

Published on Dec 18, 2018 11:44 pm IST

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘మారి 2’ విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రంలో ఫిదా ఫేమ్ సాయి పల్లవి కథానాయిక నటించింది. ఇక ఈ చిత్ర డైరెక్టర్ బాలాజీ మోహన్ ,సాయి పల్లవి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్లలో సాయి పల్లవి నిజంగా ఏడ్చేసిందని ఒక సీన్లో ఏడవకుండా యాక్ట్ చేయమని చెప్పాను కానీ షాట్ అయిపోయాక కూడా ఏడుస్తూనే వుంది అని తను నటన సహజంగా ఉంటుదని చిత్ర ప్రెస్ మీట్ లో ఆయన అన్నారు.

సూపర్ హిట్ మూవీ మారి కి సీక్వెల్ గా రానున్న ఈచిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించింది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 21న తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలవుతుంది.

ఇక ఈచిత్రం తోపాటు సాయి పల్లవి నటించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘పడి పడి లేచె మనసు’ కూడా అదే రోజు విడుదలకానుంది. మరి ఈ 21 సాయి పల్లవి కి మెమరబుల్ డే అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :