ఆటో డ్రైవర్ పాత్రలో సాయి పల్లవి
Published on May 17, 2018 9:12 am IST

హీరో ధనుష్ ప్రస్తుతం ‘మారి-2’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. 2015లో వచ్చిన ‘మారి’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. బాలాజీ మోహన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ధనుష్ కు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది.

తమిళ సినీ వర్గాల సంచారం మేరకు ఈ సినిమాలో సాయి పల్లవి ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారట. ప్రతి సినిమాలోని తన సహజమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వచ్చిన సాయి పల్లవి ఆసక్తికరమైన ఆటో డ్రైవర్ పాత్రలో ఎలా మెప్పిస్తుందో చూడాలి. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడ ఒక కీలక పాత్రలో కనిపించనుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook