రానా తో జతకట్టనున్న ఫిదా బ్యూటీ !

Rana Sai Pallavi

శ్రీ విష్ణు హీరోగా ‘నీది నాది ఒకే కథ’ అనే చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రంశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఉడుగుల మరో సారి వైవిధ్యమైన కథతో మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన రానా , సాయి పల్లవి జంటగా ఒక చిత్రాన్నితెరకెక్కించేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ఈచిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక రానా ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీ గా ఉండగా సాయి పల్లవి శర్వానంద్ తో కలిసి పడి పడి లేచె మనసు చిత్రంలో నటిస్తుంది. ఈచిత్రాన్ని కూడా సుధాకర్ చేరుకూరే నిర్మిస్తున్నారు.

Exit mobile version