సాయిపల్లవి సైకలాజికల్‌ థ్రిల్లర్‌ తెలుగులో కూడా !

సాయిపల్లవి సైకలాజికల్‌ థ్రిల్లర్‌ తెలుగులో కూడా !

Published on Jul 1, 2019 4:23 PM IST

మన ప్రేక్షకులకు సాయి పల్లవి తెలుగమ్మాయే. ‘ ఫిదా’తో అంతలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందామె. తొలి చిత్రానికి తెలుగు నేర్చుకోవడమే కాదు… తన పాత్రకు స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంది. తెలుగులో గలగలా మాట్లాడుతోంది. సాయి పల్లవి చేసిన తెలుగు సినిమాలు తక్కువే అయినప్పటికీ… ఆమెకున్న అభిమానులు ఎక్కువే. వాళ్ల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం సూపర్‌ హిట్‌ మలయాళ చిత్రం ‘అథిరన్‌’ను ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ తెలుగులోకి తీసుకొస్తున్నారు.

సాయి పల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌, ప్రకాశ్‌రాజ్‌, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్‌ హిట్‌ మలయాళ సినిమా ‘అథిరన్‌’. వివేక్‌ దర్శకత్వం వహించారు. కొన్ని రోజుల క్రితం మలయాళంలో విడుదలైన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ పై ప్రముఖ నిర్మాత ఎ.కె. కుమార్‌, జి. రవికుమార్‌ తెలుగులో అనువదిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు