తేజ్ టార్గెట్ ఈసారి పెద్దదే

తేజ్ టార్గెట్ ఈసారి పెద్దదే

Published on Dec 17, 2019 11:02 AM IST

sai dharam tej2

మెగాహీరో సాయి తేజ్ కొత్త చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ ఈ నెల 20న విడుదలకానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ట్రైలర్, పాటలు అన్నీ బాగుండటంతో చిత్రం కూడా అలరిస్తుందనే నమ్మకం ఏర్పడింది అందరిలో. పైగా తేజ్ గత చిత్రం ‘చిత్రలహరి’ హిట్ కావడంతో సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందట.

ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా యొక్క వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సుమారు రూ.17 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. సో.. ఈ మొత్తం రికవర్ కావాలంటే సినిమా భారీ హిట్ అవ్వాలి. ఇక తేజ్ గత సినిమా ‘చిత్రలహరి’ వసూళ్లు చూస్తే రూ.13 కోట్ల వరకు టచ్ అయింది. దీన్నిబట్టి ‘ప్రతిరోజూ పండగే’ కుటుంబ కథా చిత్రం కాబట్టి తొలిరోజు మంచి టాక్ తెచ్చుకుంటే భారీ విజయం పెద్ద కష్టమేమీ కాదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు