బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ బిలియనీర్ల పెళ్లిళ్లలో ఇకపై తాను డ్యాన్స్ చేయనని చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఎన్నో ఏళ్లుగా బిలియనీర్లు వారి వివాహ వేడుకల్లో సెలబ్రిటీలతో ప్రదర్శనలు ఏర్పాటుచేస్తున్నారని.. ఈ ట్రెండ్‌ను ఇకపై తాను ప్రోత్సహించాలని అనుకోవడం లేదని సైఫ్ అలీఖాన్ క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్‌లు ఇప్పటికీ ఆ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.
ఐతే, వారిలా తాను మాత్రం డ్యాన్స్ చేయాలని అనుకోవడం లేదని సైఫ్ చెప్పుకొచ్చాడు. సైఫ్ అలీఖాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభంలో వివాహ వేడుకల్లో పాల్గొని సరదాగా ఆడిపాడేవాడిని. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. అలా చేయడం నాకు అసౌకర్యంగా అనిపిస్తోంది. వేరే వారి పెళ్లిళ్లలో డ్యాన్స్ వేస్తే మన కుటుంబసభ్యులు కూడా ఇబ్బందిపడతారు’ అంటూ సైఫ్ అలీఖాన్ తెలిపారు.
