నాగసాధువుగా మారిపోయిన సైఫ్ అలీ ఖాన్

Published on May 21, 2019 8:19 am IST

అడవులలో ఉంటూ కఠినమైన జీవితం గడుపుతూ దిగంబరులై ఉండే నాగసాధువుల జీవితం ఆసక్తికర అంశం. వంటినిండా బూడిద రాసుకొని జులపాలతో ఉండే నాగసాధువులు చూడటానికి అతి భయంకరంగా ఉంటారు. దేశంలో ఏమూల కుంభమేళా జరిగినా వీరు అక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు, సంస్కారాలు చేస్తారు.

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూడా నాగ సాధువుగా మారబోతున్నడంటా . ఐతే ఇది నిజజీవితంలో కాదులెండి, ఒక సినిమా కోసం. సైఫ్ ప్రధాన పాత్రలో నవదీప్ సింగ్ దర్శకునిగా తెరకెక్కనున్న చిత్రం “లాల్ కెప్టెన్”. సైఫ్ నాగసాధువుగా నటించనున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు.

రివేంజ్ డ్రామాజోనర్ లో వస్తున్న ఈ మూవీని ఏరోస్ మరియు ఆనంద్ ఎల్. రాయ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని సెంప్టెంబర్ 6 న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారంట చిత్ర బృందం

సంబంధిత సమాచారం :

More