‘శైలజా రెడ్డి అల్లుడు’ టీజర్ త్వరలోనేనట !
Published on Jul 30, 2018 11:31 pm IST

మారుతీ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఒకప్పటి హీరోయిన్ రమ్య కృష్ణ టైటిల్ రోల్ అయిన శైలజా రెడ్డి పాత్రలో నాగ చైతన్యకు అత్తయ్యగా నటిస్తోన్నారు. ఈ చిత్రానికి సంబంధించి తాజా సమాచారాం ప్రకారం ఈ చిత్ర టీజర్ ను విడుదల చెయ్యడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. స్వయంగా ఈ చిత్ర దర్శకుడు మారుతినే ట్విట్టర్ వేదికగా ‘ఇక వెయిటింగ్ కి తెరపడింది. అతి త్వరలోనే ‘శైలజా రెడ్డి అల్లుడు’ టీజర్ ఎనౌన్స్ మెంట్’అంటూ పోస్ట్ చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తుండగా చైతు సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మారుతి గత చిత్రం ‘మహానుభావుడు’ మంచి విజయాన్ని సాధించి ఉండటం, చైతు తొలిసారి మారుతితో సినిమా చేస్తుండటంతో ఈ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook