“సైంధవ్” మూవీ కి బుల్లితెర పై రెస్పాన్స్ ఇదే!

“సైంధవ్” మూవీ కి బుల్లితెర పై రెస్పాన్స్ ఇదే!

Published on Apr 1, 2024 11:29 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోని ఈ చిత్రం, ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ లో ప్రసారం అయ్యింది.

ఈ చిత్రం కి సంబందించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా వెలువడింది. ఈ చిత్రం 2.73 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. బుల్లితెర పై కూడా సినిమా అంతగా ఆకట్టుకోలేదు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్దా శ్రీనాథ్, రుహనీ శర్మ, ఆండ్రియా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు