“సైంధవ్” సెకండ్ సింగిల్ కి టైమ్ ఫిక్స్!

“సైంధవ్” సెకండ్ సింగిల్ కి టైమ్ ఫిక్స్!

Published on Dec 10, 2023 9:30 PM IST

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సైంధవ్. సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 13 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కి సంబందించిన సెకండ్ సింగిల్ ను డిసెంబర్ 11 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 11 న సాయంత్రం 6:03 గంటలకి సరదా సరదాగా అనే పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు