పెళ్లి చేసుకోనంటున్న యువ హీరోయిన్ !

Published on Feb 10, 2019 11:36 am IST


ప్రేమమ్ చిత్రంతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది తమిళ్ బ్యూటీ సాయి పల్లవి. ఇక ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం మలయాళంతో పాటు, తెలుగు, తమిళంలో నటిస్తూ బిజీ అయిపోయింది. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. ఎప్పటికి సింగిల్ గానే ఉండి, నా పేరెంట్స్ ను బాగా చూసుకోవాలనుకుంటున్నాను అని ఆమె వెల్లడించింది.

ఇక పడి పడి లేచె మనసు తరువాత సాయి పల్లవి తెలుగులో ఇంతవరకు తన కొత్తచిత్రాన్ని ప్రకటించలేదు. ప్రస్తుతం ఆమె మలయాళం చిత్రాల్లో నటిస్తుంది. ఇక కోలీవుడ్ లో ఆమె ,సూర్య సరసన ఎన్ జి కె లో నటించింది. ఈచిత్రం విడుదలకావాల్సి వుంది.

సంబంధిత సమాచారం :