‘సలార్ – 2’ : షూట్ కి అంతా రెడీ ?

‘సలార్ – 2’ : షూట్ కి అంతా రెడీ ?

Published on Apr 11, 2024 2:00 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ పార్ట్ 1 మూవీ గత డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఇక దీని సీక్వెల్ అయిన సలార్ 2 శౌర్యంగ పర్వం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎంతో ఆసక్తి ఉంది.

ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం సలార్ 2 మూవీ మే ఫస్ట్ వీక్ నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. హీరో ప్రభాస్, హీరోయిన్ శృతి హాసన్ సహా ఇతర పాత్రధారులు కూడా షూట్ కి రెడీ అవుతున్నారట. పార్ట్ 1 ని మించేలా మరింత అద్భుతంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీని గ్రాండ్ గా తెరకెక్కించనున్నారని ఇప్పటికే నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు మాట్లాడుతూ తెలిపారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు