ఈ విషయంలో డంకీ ను బీట్ చేసిన సలార్!

ఈ విషయంలో డంకీ ను బీట్ చేసిన సలార్!

Published on Dec 3, 2023 7:40 PM IST

దేశ వ్యాప్తంగా, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలు డంకీ, సలార్. ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ తో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి వస్తున్నాయి. డిసెంబర్ 21, 2023 న డంకీ రిలీజ్ కానుంది. అంటే సలార్ రిలీజ్ కి ఒక రోజు ముందుగానే వస్తుంది. అయితే డంకీ డ్రాప్ 1 వ్యూస్ ను సలార్ ట్రైలర్ భారీగా అధిగమించింది. సలార్ థియేట్రికల్ ట్రైలర్ కి నేషనల్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సలార్ పై అంచనాలు మరింత గా పెరిగాయి.

సలార్ ట్రైలర్ కి అన్ని బాషల్లో కూడా అధ్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన డంకీ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు