యూఎస్ లో మరో మార్క్ క్రాస్ చేసిన “సలార్” ప్రీమియర్స్.!

యూఎస్ లో మరో మార్క్ క్రాస్ చేసిన “సలార్” ప్రీమియర్స్.!

Published on Dec 5, 2023 7:03 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సెన్సేషనల్ రెస్పాన్స్ కూడా అందుకుంది. మరి దీనితో అభిమానులు మరింత ఎగ్జైటెడ్ గా ఉండగా యూఎస్ ప్రీమియర్ లలో అయితే సలార్ హవా కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఈ సినిమా ఇప్పుడు జస్ట్ అడ్వాన్స్ సేల్స్ లోనే నాలుగు లక్షల డాలర్లు మార్క్ ని క్రాస్ చేసి హాఫ్ మిలియన్ దిశగా దూసుకెళ్తుంది. మరి దీనితో సలార్ పై ఉన్న హైప్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వరల్డ్ వైడ్ ఈ సినిమా ఈ డిసెంబర్ 22న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు