‘సలార్’ : ఓటిటి ఫ్యాన్స్, ఆడియన్స్ కి ‘దేవరత రైసర్’ స్పెషల్ మెసేజ్

‘సలార్’ : ఓటిటి ఫ్యాన్స్, ఆడియన్స్ కి ‘దేవరత రైసర్’ స్పెషల్ మెసేజ్

Published on Jan 20, 2024 9:07 PM IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన లేటెస్ట్ మాస్ యాక్షన్ సూపర్ హిట్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు.

అటు థియేటర్స్ లో ఆడియన్స్ ని అలరించిన ఈ మూవీ నేటి నుండి ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ ముందుకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ మూవీలో దేవరత రైసర్ గా తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు హీరో ప్రభాస్.

విషయం ఏమిటంటే, నెట్ ఫ్లిక్స్ లో ఫ్యాన్స్ ఆడియన్స్ సలార్ ని మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి అంటూ కొద్దిసేపటి క్రితం హీరో ప్రభాస్ ఒక చిన్న వీడియో బైట్ ద్వారా స్పెషల్ మెసేజ్ ఇచ్చారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రియా రెడ్డి, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు, జగపతిబాబు, బాబీ సింహా తదితరులు ఇందులో కీలక పాత్రలు చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు